ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనం 21000 ఇవ్వాలి. .ఏఐటీయూసీ డిమాండ్.

0 26

కడప ముచ్చట్లు :

కడప నగరంలోని ఏ ఐ  టి యు సి జిల్లా కార్యాలయం వద్ద  అ కడప జిల్లా  సమితి పిలుపు మేరకు.. రాష్ట్రంలో  15 సంవత్సరాలుగా గర్భవతులకు బాలింతలకు నవజాత శిశువులకు సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు ఏలాంటి ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ ,పీఎఫ్ సౌకర్యాలు లేకుండా ఉన్నారని వారికి తక్షణ ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటి వేణుగోపాల్, యల్ నాగ సుబ్బారెడ్డి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుభాషిని, అయ్యవారమ్మలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈరోజు కడప నగరంలోని స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం కడప జిల్లా సమితి పిలుపు మేరకు కడప నగరంలో ఉన్న ఆశా కార్యకర్తలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు 365 రోజులు 24 గంటల పాటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తిస్తూ గర్భవతులకు వైద్య సదుపాయాలు అందిస్తూ బాలింతలను నవజాత శిశువుల ను సంరక్షిస్తూ పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పీఎఫ్ ఎలాంటి సౌకర్యాలు లేకుండా పని చేస్తున్నారని వారికి తక్షణ ఉద్యోగ భద్రత కల్పించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 16 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్యకర్తలను 60 సంవత్సరములు వయోపరిమితి తీరిందని వారిని రిటైర్మెంట్ పేరుతో బలవంతపు రిటైర్మెంట్ చేస్తున్నారని వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి రిటైర్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తల సచివాలయాలకు బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి గత ఏడాది మార్చి నెల నుండి కరోనా బాధితులను గుర్తిస్తూ వారికి ఆశాలు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండ సేవలు అందిస్తున్నారని దానివలన ఆశా కార్యకర్తలకు అనేకమందికి కరోనా పాజిటివ్ వచ్చిసరైన వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆశలతో కరోనా లో పని చేయించుకోవడం తప్ప ఆశల ప్రాణాలకు భద్రత కల్పించే ఆలోచన చేయలేదని ప్రభుత్వం వెంటనే ఆశా కార్యకర్తలకు కరోనా రక్షణ పరికరాలు శానిటైజర్, మాస్కులు, గౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన ఆశా కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం ఇన్సూరెన్స్ కింద 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని చనిపోయిన ఆశా కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు చేస్తున్న విధులకు సంబంధించి నమోదు చేస్తున్న రికార్డ్ పుస్తకములను ఇంతవరకూ ప్రభుత్వం ఏ సంవత్సరం కూడా ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు వారి సొంత డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నారని తక్షణం రికార్డు పుస్తకాలను స్మార్టపోను ఆశా కార్యకర్తలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత మూడు సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ ఇవ్వలేదని తక్షణం యూనిఫామ్ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత ఆశాలకు వర్తించదని అధికారులు చెబుతున్నారని అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు వైయస్సార్ చేయూత వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Job security should be provided to Asha activists
The minimum wage should be 21000.
.AITUC demand.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page