ఉచిత వైద్యపరీక్షలు హర్షణీయం-టీబీసీ జేఏసి సంఘం  

0 22

జగిత్యాల ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం.కేసిఆర్ వైద్యరంగానికి ప్రాధాన్యత కల్పించారని ,ఆ క్రమంలో పేద ప్రజలకు 57 రకాల రోగ నిర్థారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించాలన్న నిర్ణయం  హర్షణీయని టీబీసీ  జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.జిల్లా కేంద్రంలోని హరి నర్సయ్య , పుప్పాల నారాయణ పటెండ్ల స్మారక భవన్ లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదు గా మారిందన్నారు.రోగం వస్తే తగ్గించుకోవడానికి  ఆస్థులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.రోగ నిర్థారణ పరీక్షలకు రూ.వేలు చెల్లించిప్రైవేట్ డయాగ్నోస్టిక్  సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ ఆర్ధిక భారం ప్రజలపై పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందించేందుకు చర్యలు ఈనెల 9 నుంచి ప్రారంభించడం పట్ల తమ సంఘం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

- Advertisement -

జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం  రూ.3 కోట్లతో నిర్మించిన  రోగ నిర్థారణ పరీక్షల కేంద్రం ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తుండడం  జిల్లా ప్రజలు ఉచితంగా రోగ నిర్దారణ పరీక్షలు చేయించుకోవడడాని కి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బండారి విజయ్,ఉపాధ్యక్షులు సింగం భాస్కర్,ఆకునూరి శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు కొండా లక్ష్మణ్,కార్యదర్శి ములస్తం శివప్రసాద్,జిల్లా యువజన జేఏసి అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ కూసరి అనిల్ కుమార్,కార్యదర్శి ,మున్సిపల్ కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్,మహిళా జేఏసి జిల్లా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి  పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags; Free Medical Tests Harshaniyam-TBC JAC Community

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page