ఎన్.టి.పి.సి భూముల్లో వ్యాపారం

0 27

విశాఖపట్నం  ముచ్చట్లు :

జీవీఎంసీ 79 వ వార్డు పరిధిలో గల దేశపాత్రునిపాలెం లో ఎన్టీపీసీకి చెందిన భూమి ఆక్రమణకు గురైంది. అయితే ఇదే స్థలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలంపై వ్యాపారం చేస్తున్నారు. సర్వేనెంబర్ 101 లో సబ్ డివిజన్లు ఉన్నా ఎన్టీపీసీకి చెందిన భూమిని భూ కబ్జాదారులు అనధికారికంగా సబ్ డివిజన్లు సృష్టించి తమ ఆధీనంలోకి కి కి తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. ఈ భూ కబ్జా కి ముఖ్య సూత్రధారి ఆర్ఇసిఎస్ ఉద్యోగి అయినా లక్కరాజు రాము అనే వ్యక్తి ప్రభుత్వ భూముల ని తన ఆధీనంలోకి తీసుకుని ఆయన అక్రమంగా వ్యాపారం చేయడమే కాకుండా ఆయన ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై సంబంధిత వ్యక్తిని ఉదయం విలేకర్ ప్రశ్నించగా నేను ఎన్టిపిసి యాజమాన్యానికి డబ్బుల రూపంలో థాయిలాలు ఇచ్చాను నన్ను ఎవరూ ఏమీ చేయలేరు మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి ఎన్టిపిసి యాజమాన్యం నా వెనక ఉంది డబ్బులు తీసుకున్న వ్యక్తులు నా వెనకే ఉన్నారు నన్ను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన కరాఖండిగా ఉదయం విలేకరితో చెప్పారు. దీనిపై ఎన్టిపిసి యాజమాన్యం స్పందించకపోతే స్థానిక ప్రజలు పలువురు స్పందించవలసిన ఉంటుందని హెచ్చరించారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Business on NTPC lands

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page