ఎమ్మెల్సీల కోసం వెయిటింగ్

0 15

గుంటూరు  ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఈ మూడు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి. శాసనసభలో సభ్యుల సంఖ్యాబలంతో ఈ మూడు స్థానాలను వైసీపీ చేజిక్కించుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మే 31వతేదీ నాటికి ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నా కరోనా పరిస్థితుల కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. జూన్ నెలలో కొంత కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్నికలను నిర్వహించే అవకాశముంది.అయితే ఈ మూడు స్థానాల్లో ఎమ్మెల్సీలుగా జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. జగన్ తన పాదయాత్ర సమీపంలో అనేక మందికి ఎమ్మెల్సీ పదవులను హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్ అవకాశం కల్పించారు. కానీ పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని కాకుండా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అంటూ జగన్ వేసిన లెక్కలు పార్టీలోనే విమర్శలకు దారితీశాయి.దీంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చిన వారికే పదవులు కేటాయిస్తారన్న టాక్ విన్పిస్తుంది. ప్రధానంగా మర్రి రాజశేఖర్ ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ పదవి కోసం నిరీక్షిస్తున్నారు. ఈయన పట్ల జగన్ కూడా సానుకూలంగా ఉన్నారు. కమ్మ సామాజికవర్గానికి ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో ఈసారి జగన్ మర్రి రాజశేఖర్ కు ఖచ్చితంగా కేటాయిస్తారన్న టాక్ పార్టీలో వినపడుతుంది. జగన్ కూడా అదే రకమైన సంకేతాలు పంపారంటున్నారు.దీంతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్సీ పదవులకోసం చూస్తున్నారు. దీంతోపాటు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి కూడా స్థానం దక్కే అవకాశముందన్న టాక్ విన్పిస్తుంది. ఇటీవలే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీఇచ్చారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి దాడి వీరభద్రరావు పేరు విన్పిస్తుంది. ఇలా కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముగ్గురు పేర్లను ఎంపికను జగన్ పూర్తి చేశారంటున్నారు. ఈసారి అగ్రవర్ణాలకే ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Waiting for the emcees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page