కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ను వెంటనే సస్పెండ్ చేయాలి

0 25

– జిల్లా కలెక్టర్ ను కోరిన సీమాంధ్ర ఎమ్మార్పీఎస్.

 

నెల్లూరు ముచ్చట్లు :

 

- Advertisement -

నెల్లూరు నగర పాలక శాఖలో పనిచేస్తున్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ వెంటనే సస్పెండ్ చేయాలని సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. నెల్లూరు కార్పొరేషన్ లో పనిచేస్తున్న పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మేస్త్రి లతో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంది సుబ్బయ్య  జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఆఫీసర్ వెంకటరమణ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నా యని  ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్ లను ప్రోత్సహిస్తూ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఇన్స్పెక్టర్లను మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ కించపరుస్తూ ఉన్నారని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మాదిగల పట్ల మున్సిపల్ ఆఫీసర్ తన వైఖరిని మార్చుకోకుంటే మాదిగ సామాజిక వర్గాలకు చెందిన వివిధ అసోసియేషన్లు, నాయకుల ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళన చేపడతామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ ఆఫీసు పై తాము చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయమై సమగ్ర విచారణ జరిపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు, నెల్లూరు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Corporation Health Officer Venkataramana should be suspended immediately

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page