గులాబీ గూటికి రమణ

0 20

కరీంనగర్ ముచ్చట్లు :
గులాబీ దళంలోకి పసుపు దళపతి రాబోతున్నారన్న ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు ఈటల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈటల ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొన్న ఈ సమయంలోతెలంగాణ టీడీపీ అధ్యక్షుడి వ్యవహారం మరింత హీట్ రాజేసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఆయన పసుపు జెండాను వదిలి గులాబీ దళంలో చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.పంచాయతీరాజ్ మంత్రి, గతంలో టీడీపీలో కలసి పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే రమణతో చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నెల 3న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యాయి. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నా కారు ఎక్కేందుకే రమణ మొగ్గు చూపుతున్నారన్న టాక్ నడుస్తోంది. సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ వస్తే ఆయన చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్.రమణ 1994లో జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కరీంనగర్ నుంచి గెలిచిన ఒకే ఒక్క టీడీపీ ఎంపీ రమణ కావడం విశేషం. అనంతరం జరిగిన 1999, 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో వైఎస్ హవా నడుస్తున్నప్పటికీ జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 రాష్ట్ర విభజనానంతరం టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Ramana to the pink gooty

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page