గృహ నిర్మాణాల శంకుస్థాపనలో పాల్గోన్న ఎమ్మెల్యే

0 20

అనపర్తి ముచ్చట్లు :

 

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చండ్రేడు , సుభద్రంపేట గ్రామాలలో నవరత్న పథకాల్లో  భాగంగా   పేదలందరికి ఇళ్ళు,  వైఎస్పార్  జగనన్న కాలనీలు గృహ నిర్మాణాలు శంకుస్థాపన కార్యక్రమంలో  అనపర్తి శాసన సభ్యుడు డాక్టర్ సత్తి సూర్య నారాయణరెడ్డి పాల్గోన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ళు లేని  నిరుపేదలైన అర్హులైన  వారి అందరికీ ఈ పథకం ద్వారా ఇంటి  స్థలం ఇవ్వడమే కాకుండా, ఇంటి  నిర్మాణానికి లక్షా ఎనభై వేల రూపాయలు కేటాయిస్తున్నామని  ఆయన తెలిపారు.  అర్హులైన వారు ఎవరైనా  వుంటే  వారికి  తొంభై  రోజుల్లోనే ఇంటిస్థలం కేటాయిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే  రాష్ట్రంలో  ముఫ్ఫై లక్షలు మందికి  ఇంటి స్థలం కేటాయించామని ఆయన తెలిపారు.  ఇంత మంది పేదలకు ఇంటి స్థలం కేటాయించడం  దేశంలోనే  ఒక సువర్ణాధ్యమని  ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైయస్ ఆర్ సిపి  నాయకులు ,  మహిళలు, కార్యకర్తలు కోవిడ్  నిబంధనలు పాటిస్తూ  పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: MLA involved in the cobblestones of housing structures

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page