గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి దుర్మరణం

0 27

చిత్తూరు  ముచ్చట్లు :
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం తిరుపతి రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దారుణ ఘటనలో టెక్నీషియన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కార్మికుడు నయాజ్ కాలు, చేయి పూర్తిగా కోల్పోగా, శివమహేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయుర్వేద మూలికలతో తయారుచేసిన పెర్- ప్యూమ్ సుగంధాలు తయారుచేసిన వాటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ను స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని కంటైనర్ లో ఏర్పాటు చేశారు. వాటిని అమర్చే క్రమంలో ఓ గ్యాస్ పేలిపోయి సిలిండర్ పగిలిపోయింది. ఈ ప్రమాదం టెక్నీషియన్ లింగన్న అక్కడికక్కడే మృతిచెందగా,  మరొకరికి ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవి మనోహరచారి, సీఐ నరసింహులు ప్రమాదం జరగడానికి కారణాలు ఆరా తీస్తున్నారు.  గాయపడిన వారిని స్థానికంగా ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Gas cylinder explodes, killing one

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page