తూకంలో మోసానికి పాల్పడుతున్న రేషన్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలి

0 23

కోరుట్ల ముచ్చట్లు :

రేషన్ బియ్యం తూకంలో మోసానికి పాల్పడుతున్న పట్టణంలోని కొంతమంది రేషన్ డీలర్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ సోషల్ వర్కర్ రమణ మిట్టపెల్లి మంగళవారం స్థానిక తహసీల్దార్ నడిమెట్ల సత్యనారాయణ కి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకంలో మోసానికి పాల్పడుతూ వినియోగదారులకు తక్కువ బియ్యం ఇస్తున్నారని, పది కిలోల బియ్యానికి సుమారు ఒక కిలో వరకు తక్కువగా తూకం వేస్తూ మోసానికి పాల్పడుతున్నారని, లబ్దిదారులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. తూకం తక్కువ వేసిన బియ్యాన్ని పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ కు తరలించి రేషన్ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  కరోనా కష్ట కాలంలో పేద, మధ్య తరగతి వారిని దోచుకోవడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆన్నారు. రెవెన్యూ మరియు సివిల్ సప్లై అధికారులు క్షేత్ర స్థాయి రేషన్ షాపులను పర్యటించి, విచారణ జరిపి మోసాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్లు పై తగు చర్యలు తీసుకోవాలని  తహశీల్దార్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Ration dealers committing weight fraud
The above steps should be taken

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page