నెల్లూరు జిల్లాలో 780 మంది సర్పంచ్ లకు చెక్ పవర్  సాంకేతిక కారణాలతో 155 మందికి నిలిపివేత

0 67

నెల్లూరు    ముచ్చట్లు :
పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాలోని సర్పంచ్లకు చెక్పవర్ ఇచ్చారు. పంచాయితీ పాలకవర్గాలు కొలువుదీరి 4 నెలలైనా, పంచాయతీ అధికారులు పరిపాలన సాగించారు. నెల్లూరు జిల్లాలో 941 పంచాయతీలు ఉన్నాయి. అందులో 780 మంది సర్పంచులకు మాత్రమే ప్రభుత్వం చెక్ పవర్ కట్టబెట్టింది. ఇంకనూ 155 మంది సర్పంచులకు  చెక్ పవర్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సర్పంచులకు ఈ అధికారాలు లేకపోవడంతో, ప్రతి చిన్న పనికి ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయితీ కార్యదర్శుల పై ఆధారపడాల్సి వచ్చింది. సి ఎఫ్ ఎం ఎస్ లో ఐడి లు కేటాయించడం వల్ల ఆయా పంచాయతీలకు సంబంధించిన నిధులను సర్పంచులే డ్రా చేసుకునే అవకాశం  ప్రభుత్వం చెక్ పవర్తో కల్పించింది. జిల్లాలో ,941 పంచాయతీలు ఉండగా, వివిధ కారణాలతో జిల్లాలో 4 చోట్ల ఎన్నికలు ఆగిపోయాయి. వీటిలో వెంకటాచలం మండలం లో 2, చేజర్ల మండలంలో 2 పంచాయతీలలో ఎన్నికలు జరగలేదు. నెల్లూరు గ్రామీణ మండలం, పొదలకూరు మండలాలలో ఇప్పటి వరకు ఇద్దరు సర్పంచులు కరోనా వైరస్ పాజిటివ్ తో మరణించారు. దీంతో 935 సర్పంచులకు గాను 780 మంది సర్పంచ్లకు మాత్రమే ప్రభుత్వం చెక్పవర్ ఇచ్చింది. వివిధ సాంకేతిక కారణాలతో 155 మందికి చెక్ పవర్ ఆగింది. వీరందరికీ కూడా త్వరలోనే చెక్పవర్ అధికారాన్ని ఇచ్చేందుకు గాను, జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో గ్రామాలలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేసి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, సర్పంచులు, పంచాయతీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే అవసరమైన ప్రత్యేక నిధులతో పాటు,14,15 ఆర్థిక సంఘం నిధులను ఆయా పంచాయతీల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా సర్పంచులకు, స్వయంగా నిధులను డ్రా చేసే అధికారం లేక పోయింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Check power for 780 sarpanches in Nellore district
Suspension of 155 due to technical reasons

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page