పుంగనూరులో జగనన్న కాలనీలతో పట్టణాలు ఏర్పాటు – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

0 172

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పట్టణాలు ఏర్పాటౌతోందని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సింగిరిగుంట, మార్లపల్లె గ్రామాల్లో జగనన్న కాలనీ గృహాలకు భూమిపూజ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 23 పంచాయతీల పరిధిలోను అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పంచాయతీలోను కాలనీలు ఏర్పాటౌతోందన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి, కాలనీలను సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఉండి, పట్టాలు రాకపోయినా వారికి కూడ 90 రోజుల్లో పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, ఇది నిరంతర పక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఆంజప్ప, పంచాయతీ సెక్రటరీ సుధాకర్‌, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రెడ్డిశేఖర్‌, నాగభూషణం,ఆంతోని, మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బాబు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Establishment of towns with Jagannath colonies in Punganur – Akkisani Bhaskarreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page