ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

0 5

హైదరాబాద్ ముచ్చట్లు :
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని స్టేట్‌ డాటా సెంటర్‌ (ఎస్‌డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించి పరిష్కరించడంతో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు ఇబ్బంది తొలగిపోయింది. రెండు రోజులుగా ఈ సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నానికిగానీ ఫలించలేదు. దీంతో ఐదు రోజులుగా నెమ్మదించిన రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు  ఊపందుకోనున్నాయి.సమస్యను పరిష్కరించి రాష్ట్రం లోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నెట్‌వర్క్‌ను పరిశీలించారు. అంతా సజావుగా పనిచేస్తుండడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లావాదేవీలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. సర్వర్‌ మొరాయించడంతో ఐదు రోజులుగా పెండింగ్‌లో పడిన లావాదేవీలతోపాటు సోమవారం బుక్‌ చేసుకునే స్లాట్‌లకు సంబంధించిన లావాదేవీలను కూడా చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఐదు రోజులపాటు ఇబ్బంది పెట్టిన సమస్య చాలా చిన్నదని, అయితే దాన్ని గుర్తించడానికే సమయం పట్టిందని తెలుస్తోంది. ఎస్‌డీసీలో ఉన్న ప్రధాన సర్వర్‌ రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను సమన్వయం చేస్తుంది. ఈ సర్వర్‌ ద్వారానే డాటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఈ డాటా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లోని ఒక ఫైలు కరప్ట్‌ అయిందని సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డ్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ కాలేదు. రెండు రోజులుగా ఎంత కుస్తీ పడుతున్నా ఈ ఫైల్‌ను గుర్తించలేకపోయారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణుల టీం ప్రతి ఫైలును చెక్‌ చేయడంతో ఈ కరప్ట్‌ ఫైల్‌ దొరికింది. దీన్ని సరిచేయడంతో సమస్య పరిష్కారమైంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Initial registrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page