బాబు గ్రాఫ్ మరింతగా పతనమైంది: విజయసాయిరెడ్డి

0 26

అమరావతిముచ్చట్లు :

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబును దుయ్యబట్టారు. ‘పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బాబు గ్రాఫ్ మరింతగా పతనమైందని స్పష్టమైంది. కానీ ఇంత అవమానం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. జూ. ఎన్టీఆర్ రావాల్సిందే అని కుప్పంలో కటౌట్లు పెట్టి, జెండాలు ఎగరేశారట సొంత కార్యకర్తలు. ఈ వయసులో నీకు ఎంతటి దౌర్భాగ్యం బాబూ” అంటూ ఎద్దేవా చేశారు. ఇక అంతకు ముందు లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు అని, కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు వంచుతారు. ప్రజాదరణ కోల్పోయి పూనకం వచ్చిన వాడిలా శివాలూగితే జనం వేపమండలతో బడిత పూజ చేస్తారు’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Babu Graf falls further: Vijayasaireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page