మరో ఉద్యమానికి సిద్దమవుతున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్

0 28

వరంగల్ అర్బన్  ముచ్చట్లు :

కమలాపూర్ లో ఈటల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ఆయువు పట్టు అయితే హుజూరాబాద్ నియోజకవర్గం గుండెకాయ నిలిచిందని అన్నారు. మొదటి నుంచి ఉద్యమ బిడ్డగా తగిన బలం ఇచ్చి నన్ను హుజూరాబాద్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ప్రజలంతా నువ్వు ఆత్మగౌరవం కోసం కోట్లాడు బిడ్డనీ వెంట మేము ఉన్నామని ఆశీర్వదిస్తున్నారు. హుజూరాబాద్ లో  ఉప ఎన్నిక వస్తె ధర్మం అధర్మంకు మధ్య యుద్ధం అని ప్రజలు భావిస్తున్నారు. హుజూరాబాద్ లో జరగబోయే సంగ్రామంలో ధర్మం దే విజయం. నిరుద్యోగులు, ఉద్యోగులు హక్కుల సాధన కోసం ఉద్యమానికి సిద్దం అవుతున్నారు. కొందరు నాయకులు తాయిలాలకు తలొగ్గి నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రజలు మీకు తగిన బుద్ది చెబుతారు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బాగు కోరుకునే వారు ఒక్కటిగా సాగే సమయం కోసం చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ రక్షణ కోసం కలిసిలికట్టుగా పని చేద్దాం. హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు మరో ఆత్మ గౌరవ పోరాటానికి సిద్ధం అవుతున్నారని అయన అన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Preparing for another movement
MLA Itala Rajender

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page