రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్

0 52

హైదరాబాద్  ముచ్చట్లు :
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట సరికొత్త చర్చకు దారితీసింది. ఓ పత్రికా కథనాన్ని ఆధారం చేసుకుని.. మంత్రి జగదీశ్ రెడ్డిపై రేవంత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’… కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా…? అంటూ ఆ ట్వీట్ సాగింది. ఈ ట్వీట్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అంటున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

- Advertisement -

Tags:Rewanth Reddy’s tweet is a hot topic in political circles

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page