వాహనాల రీసైక్లింగ్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రాలు ఏర్పాటు : ‘రాంకీ

0 27

హైదరాబాద్ ముచ్చట్లు :

వాహనాల రీసైక్లింగ్ కోసం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పాతిక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సంస్థ…  ‘రాంకీ ఎన్విరో ఇంజినీర్స్’…  మొదటి దశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఆదిత్యపూర్, చెన్నై, బెంగళూరు, లో, ఆ తర్వాత మరో 25 కు పైగా నగరాల్లో రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి… సరకు రవాణా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, విధానాలతో ఈ కేంద్రాలను ఏర్పాటు జరగనున్నట్లు రాంకీ  ఈ సందర్భంగా వెల్లడించింది.  మరిన్ని వివరాలిలా ఉన్నాయి. ఇక… దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ళలో… కాలం చెల్లిపోనున్న వాహనాలు దాదాపు రెండు కోట్లకు పైగా ఉంటాయని అంచనా. వీటిని రీ సైకిల్ చేయనిపక్షంలో… వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాగా… కేంద్రం వెహికిల్ స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించించిన విషయం తెలిసిందే. వెహికిల్ రీసైక్లింగ్ కోసం రాంకీ సంస్థ…  పాసింజర్ వెహికిల్ సెగ్మెంట్, కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్ సెక్టార్లలోని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. కాగా… 15-20 ఏళ్ళు నిండిన వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు. వీటిని తగ్గించాలని, తద్వారా ఉద్గారాలను తగ్గించాలని కేంద్రం భావిస్తోన్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Centers set up across the country for vehicle recycling: ‘Ranky

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page