వెలగలేరు లో ఆగని మట్టి మాఫియా ఆగడాలు.

0 9

మైలవరం   ముచ్చట్లు :
వెలగలేరు లో మట్టి మాఫియా ఆగడాలు ఆగడంలేదు.  భలే రావు చెరువు నుంచి వందలాది ట్రక్కుల మట్టి ఇటుక బట్టీలు కి తరలించుకుపోతోంది.  అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  అధికార పార్టీ నాయకులకు చెందిన ఖాళీ ప్రదేశాల్లో వందలాది ట్రక్కుల  మట్టి నిల్వవుంటోందని వారు అంటున్నారు.  పదుల సంఖ్యలో ట్రాక్టర్ ను పెట్టి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న  ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదు.  గత వారం రోజులుగా వేలాది ట్రక్కుల మట్టి తరలించారని వారు ఆరోపిస్తున్ఆరు.  లక్షలాది రూపాయల ప్రభుత్వ సొమ్మును తన జేబులో వేసుకుంటున్నారు కొంతమంది నేతలు. ఇంత జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడంలేదని గ్రామస్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇళ్ల మెరక లకు మట్టి తోలుకోవాలంటే  సవాలక్ష నిబంధనలు పెట్టే అధికారులు ఇటుక బట్టీలకు మట్టి తరలి పోతుంటే ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే మట్టి అక్రమ రవాణా అడ్డుకోవాలని  వెలగలేరు గ్రామస్తులు కోరుతున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Non-stop mafia players in Velagaleru.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page