20 మందిపై టీడీపీ ఆరా

0 22

విజయవాడముచ్చట్లు :

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అధికారం కోల్పోయాక అసలు విషయం తెలిసి వచ్చింది. ఎవరు తన వాళ్లో, ఎవరు కాదో ఆయనకు తెలిసి వచ్చింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. వారిలో కూడా ఎక్కువగా గతంలో ఏ పదవులు పొందని వారే కావడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కించుకున్న వారు మౌనంగా ఉంటే, ఏ పదవులు దక్కని వారు ఇప్పుడు పార్టీని ఆదుకుంటున్నారు.అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, జవహర్ వంటి వారే యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు కేబినెట్ లో పనిచేసిన దాదాపు ఇరవై మంది మంత్రులు యాక్టివ్ గా లేరు. దీనికి వారి వ్యక్తిగత కారణాలు వారికి ఉన్నాయని చెబుతున్నా, ఆయా నియోజవకర్గాల్లోనే కాకుండా ఆ ప్రభావం రాష్ట్ర పార్టీపై చూపుతుందని చెబుతున్నారు.ఇక గతంలో ఏ పనులు అనుభవించని వారు ఇప్పుడు యాక్టిగ్ గా ఉండటాన్ని చంద్రబాబు గమనిస్తున్నారు. పంచుమర్తి అనూరాధ, పట్టాభి, వర్ల రామయ్య వంటి వారు యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంలో వీరు ముందుంటున్నారు. చంద్రబాబు కు అండగా నిలుస్తున్నారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉంటూ యాక్టివ్ గా ఉన్న వారి జాబితాను చంద్రబాబు రూపొందిస్తున్నారట.ఈసారి అధికారంలోకి వస్తే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా ఉండే నేతలతోనే చంద్రబాబు నేరుగా టచ్ లోకి వస్తున్నారని, వారు చేసే విమర్శలను ఆయన ప్రశంసిస్తున్నారని చెబుతున్నారు. ఎలాంటి కేసుల నమోదయినా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తనకు అండగా ఉంటున్న వారి పట్ల సానుకూలతతో ఉన్నట్లు తెలసింది. వీరిలో కొందరికి ఆర్థిక సాయం కూడా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:TDP ara on 20 people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page