ఇంకా రద్దు కాలేదు – క్లారిటీ ఇచ్చిన మంత్రి సబితా

0 17

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నారనే అంశంపై విద్యాశాఖ మంత్రిసబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. కానీ, ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో మంత్రి సబిత బుధవారం స్పందించారు.బుధవారం వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సబిత.. పరీక్షల రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై ఇంకా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారులతో సమీక్ష జరిపి చర్చించిన అనంతరం పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.అంతకుముందు, వికారాబాద్ ప్రభుత్వ దవాఖానాలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను మంత్రి సబితా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి ఉచితంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీంతో ఎంతో మంది పేదలకు వైద్య ఖర్చుల భారం తప్పుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Not canceled yet
– Minister Sabita given Clarity

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page