ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

0 28

చిత్తూరు జిల్లా ముచ్చట్లు :

 

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు కోరారు. బుధవారం కార్వేటినగరం ప్రధాన పాఠశాలలో ఎస్టీయూ 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందే ఆవిర్భవించిన ఎస్టీయు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులకు సర్వీసు పరంగా సమస్య ఉత్పన్నమవగానే గుర్తొచ్చే మొట్టమొదటి సంఘం ఎస్టీయూ మాత్రమే అని పునరుద్ఘాటించారు. విద్యారంగానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం ప్రభుత్వం తీసుకొనేటప్పుడు ముందుగా ఎస్టీ యూ ను సంప్రదిస్తారు అని తెలిపారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Teachers ’problems need to be solved

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page