ఎల్ రమణతో ఎంత వరకు

0 20

హైదరాబాద్ ముచ్చట్లు:
లుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఆయన చేరికకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈటల రాజందర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎల్. రమణను పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఎల్. రమణకు, ఈటల రాజేందర్ కు మధ్య పోలిక ఉందా? ఆయనతో ఎల్ రమణకు పోటీయా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఎల్ రమణకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను అంతర్గతంగా పార్టీలో అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.ఎల్. రమణ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నేత. జగిత్యాల నుంచి నేతగా ఎదిగారు. కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ముఖ్యనేతగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. దశాబ్దాల కాలం నుంచి టీడీపీనే నమ్ముకున్న ఎల్. రమణను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చంద్రబాబు నియమించారు. రెండోసారి ఆయనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఆయననే రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.ఇక ఎల్. రమణ ను అవుట్ డేటెడ్ లీడర్ గా టీఆర్ఎస్ నేతలే అభివర్ణిస్తున్నారు. ఆయన ప్రజలను మర్చిపోయి చాలా కాలం అయిందంటున్నారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు అడపా దడపా రావడం తప్ప ఆయన పార్టీ కోసం చేసిందేమీ లేదు. అంతేకాకుండా ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ తరుపున పోట ీచేసి ఎల్.రమణ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.అటువంటి ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ పార్టీలోకి తీసుకురావడపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి తీసుకు రావాల్సిన ఖర్మ ఏంటన్న ప్రశ్నలు గులాబీ పార్టీ లోనే విన్పిస్తున్నాయి. అయితే కేసీఆర్ నిర్ణయం కావడంతో ఎవరూ పైకి ఏమీ అనలేకపోతున్నారు. ఎల్. రమణను బీసీ కార్డుతో పార్టీలోకి తీసుకువచ్చినా ఫలితం ఏమాత్రం ఉండదన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:How far with L Ramana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page