గర్భిణీలకు,బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలి.. మండల ఇంచార్జ్ మురళీ మోహన్ రెడ్డి

0 12

కోసిగి ముచ్చట్లు:
మండలంలోని 69 అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పొర్టిపైడ్ బియ్యం,బ్యాళ్ళు, మంచినూనె అందిస్తూ,ఏ ఒక్క బాలింత,గర్భిణీలకు పౌష్టికా హారలోపం లేకుండా జగనన్న ప్రభుత్వం ప్రత్యేకదృష్టితో పాలన సాగిస్తున్నారని మండల ఇంచార్జ్ మురళీ మోహన్ రెడ్డి అన్నారు.బుధవారం కోసిగిలోని పంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసిన పొర్టిపైడ్ బియ్యం పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 93క్వింటాల 50కేజీల బియ్యం మంజూరు కాగా ప్రతి గర్భిణీ,బాలింతకు మూడు కేజీల బియ్యం,కిలో కందిపప్పు,ఆరలీటరు మంచి నూనె అందజేయడం జరుగు తుందని,ఇది కరోనా నేపథ్యం లో సెంటర్ల యందు బోజన సదుపాయం లేనందున వారి ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ యస్.అయ్యమ్మ,అర్లబండ సహాకార సంఘం అధ్యక్షులు మహాంతేష్,మాజీ జడ్పీటీసీ మంగమ్మ,పంచాయతీ కార్యదర్శి సత్యన్న,వార్డు మెంబర్ త్రిపుర సుందరి, అంగన్వాడీ కార్యకర్తలు లుసమ్మ,హెబ్సీబా,వరలక్ష్మీ, పద్మ,మహిళ పోలీసులు, గర్భవతులు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Pregnant and postpartum women should be treated for malnutrition.
Mandal in-charge Murali Mohan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page