గోనెగండ్లలో ఆనందయ్య మందు తయారి – డాక్టర్.యస్ ఏ యస్ ఖాద్రి

0 22

యునాని వైద్యులకు మెగాఫ్యాన్స్ ఘనసన్మానం

గోనెగండ్ల   ముచ్చట్లు:

- Advertisement -

ఆయుష్ శాఖ, ప్రభుత్వ యునాని వైద్యశాల, యునాని వైద్య అధికారి  డాక్టర్.ఖాద్రి ఆనందయ్య మందు తయారికి ఎంపిక కావడంతో ఎమ్మిగనూరు మెగాఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, గోనెగండ్ల మండల అధ్యక్షులు మాలిక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు, ఈ సంధర్బంగా  డాక్టర్ ఖాద్రి మాట్లాడుతూ రాయలసీ మజోన్ పరిధి నుంచి గతవారం రోజుల క్రితం  విజయవాడలో జరిగిన డేమోకు హాజరై మందు తయారీ గురించి తెలుసుకొని స్వతహాగా తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల12వ తేదీ కర్నూలులో జరుగు రాయలసీమ జిల్లాల నుంచి డేమోలో పాల్గొనే కడప, కర్నూలు, అనంతపురం, జిల్లాలకు చెందిన ఆయుర్వేద/యునాని వైద్యులకు డాక్టర్ ఖాద్రి డెమో ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని మూలికలు దొరికిన కొన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుకు వచ్చి కొన్ని వస్తు సామగ్రిలు అందిస్తే ప్రజలకు ఆనందయ్య మందు తయారు చేసి ఉచితంగా అందిస్తామని తెలిపారు, మెగాఫ్యాన్స్ సేవా సమితి తాలూకా అధ్యక్షులు, రాహుల్ సాగర్, మాట్లాడుతూ, ఆనందయ్య మందు తయారికి రాయలసీమజోన్ లో కర్నూలు జిల్లాలోనే గోనెగండ్ల ఎంపిక కావడం మండల ప్రజల అదృష్టం అన్నారు, డాక్టర్ ఖాద్రి,  గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు జాగ్రత్తలు పలు సూచనలు ఇస్తూ, కరోనా వ్యాధి పై గ్రామవిధుల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉన్న భయాలను దూరం చేస్తూ  ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే ఆనందయ్య మందు  గోనెగండ్లలో తయారు చేయడం గ్రామ ప్రజల అదృష్టం అన్నారు. మందుల తయారి సామాగ్రి అందించే దాతలు ముందుకు రావాలని కోరారు, ఈ కార్యక్రమంలో మెగాఫ్యాన్స్ సేవాసమితి సభ్యులు ఖాసీం సాహెబ్, చాంద్ బాషా, పులికొండ, పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Anandayya drug preparation in Gonegandla
– Dr. AS Khadri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page