చౌడేపల్లెలో అభివృద్దిపనులను వేగవంతం చేయండి- అధికారులతో పెద్దిరెడ్డి సమీక్ష

0 79

– కొత్త పనులను గుర్తించి కూలీలకు పనులివ్వాలి
-నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

మండలంలో వివిధ శాఖల సమన్వయంతో జరుగుతున్న అభివృద్దిపనులను వేగవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గ్రామాలో అవసరమైన పనులను మంజూరు చేశారని, వాటిని త్వరగా పూర్తిచేసేలా స్థానిక ప్రజాప్రతినిథులు,అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. శాఖల వారీగా అభివృద్ది పనులపై సమిక్షించారు. ఇక నుంచి ప్రతి వారం సమీక్ష ఉంటుందని, ప్రగతి పట్ల దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాల్లో జాబ్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంభానికి వందరోజులు పనులు కేటాయించాలన్నారు. రైతులకు, కూలీలకు అవసరమైన కొత్త పనులు గుర్తించి కూలీలు పనులకు వచ్చేలా చూడాలన్నారు. విధి నిర్వహణపట్ల నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకటరత్నం,మంత్రి పిఏ చంద్రహాస్‌, ఏపిడీ శ్రీనివాసులు, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి,మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, బూత్‌కమిటి అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రవిరెడ్డి తదితరులున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Accelerate development work in Choudepalle- Peddireddy review with authorities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page