జనసేన ఆధ్వర్యంలో జిజిహెచ్ లో 26 రోజులుగా అన్నదానం

0 15

నెల్లూరు  ముచ్చట్లు:
జనసేన ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ  సర్వజన ఆసుపత్రి లో గత 26 రోజులుగా రోగులకు, సహాయకులకు అన్నదానం చేస్తున్నారు. అంతేకాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో అన్ని పేద ప్రజల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ క్యాన్లను అందుబాటులో ఉంచడమే కాకుండా 3 పూటలా త్రాగు నీరు అందే విధంగా తగిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బుధవారం 26వ రోజు జీజీహెచ్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జిల్లా ఇన్చార్జి మను క్రాంత్ రెడ్డి  సూచనలు సలహాలతో, దాతల సహకారంతో 26 రోజులుగా నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరు నగరంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున హోటల్స్ తెరవక , ఆహారం దొరక్క నిరు పేద ప్రజలు, రోగులు అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించాలన్న పార్టీ అధినేతల ఆదేశాల మేరకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఇటువంటి విపత్కర ఆపత్కాల సమయాలలో ప్రతి ఒక్కరు తమవంతు చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా  జి హెచ్ లో  క్యూలైన్ల ద్వారా  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, కోట బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Annadanam for 26 days in GGH under Janasena

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page