తమ్ముళ్ల జూనియర్ జపం

0 18

హైదరాబాద్   ముచ్చట్లు:
లుగుదేశం పార్టీ పుట్టుక పెరుగుదల అంతా నందమూరి వారి చేతుల్లోనే జరిగింది. మూడున్నర పదుల సినీ జీవితాన్ని త్యాగం చేసి మరీ ఎన్టీఆర్ ప్రజల కోసం సేవ చేసేందుకు తెలుగుదేశాన్ని స్థాపించారు. ఆయన వినూత్న ఆలోచనలతో ఉమ్మడి ఏపీ అంతా చైతన్య రధం మీద తిరిగి కేవలం తొమ్మిది నెలలలో అధికారంలోకి తీసుకువచ్చారు. అలా అన్న గారి తరువాతనే చంద్రబాబు అయినా మరెవరు అయినా పార్టీలో సేవలు అందించింది. కరడు కట్టిన టీడీపీ అభిమానులకు ఈ సంగతి తెలియనిది కాదు. నిజానికి ఎన్టీఆర్ తరువాత చంద్రబాబే టీడీపీకి వారసుడు అని అంతా అనుకున్నారు. అయితే కాస్తా తొందరగా ఒక విధంగా బలవంతంగా చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నాడు అన్నది అసలైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన.సరే చంద్రబాబు చేతిలో పాతికేళ్ల పాటు పదిలంగా టీడీపీ జెండా ఎగిరింది. దీన్ని కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహించి సర్దుకున్నారు. ఎందుకంటే బాబును మించిన లీడర్లు ఎవరూ నాడు లేరు కాబటి, ఇక ఇపుడు బాబు కూడా సీనియర్ ఎన్టీఆర్ ఈడులోకి వచ్చేశారు. ఆయన చేతిలో2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడింది. ఇక బాబు తరువాత ఎవరు అంటే మళ్లీ టీడీపీని మోస్తున్న క్యాడర్ కరెక్ట్ జడ్జిమెంటే చెబుతోంది. ఈసారి నందమూరి జూనియర్ఎన్టీఆర్ కే ఓటు వేస్తోంది. ఆయన చేతిలో పార్టీ కొన్నేళ్ళ పాటు హాయిగా ఉంటుందని, అదే శ్రీరామ రక్ష అవుతుందని అంటోంది.

 

ఆ మధ్యన చంద్రబాబు కుప్పం టూర్ కి వెళ్తే బహిరంగ సభలోనే జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలంటూ క్యాడర్ గోల చేసింది. అప్పటికి లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ ఓడింది. కుప్పంలోనే కూసాలు కదిలిపోయాయి. దాంతో బాబు దీక్షాదక్షత మీద సొంత నియోజకవర్గంలోనే అలా తొలిసారి డౌట్ వ్యక్తం అయింది. మరి ఇన్నాళ్ళు జరిగినా దాని మీద చంద్రబాబు సీరియస్ గా ఆలోచించినట్లుగా లేరు అనుకున్నారో ఏమో ఏకంగా కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుతూ కార్యకర్తలు జెండా ఎగరేశారు. అది అనివార్యం అని కూడా ఏపీలో మిగిలిన టీడీపీ తమ్ముళ్ళు అంతా అంటున్నారు.చంద్రబాబు విషయం జనాలకు తెలిసిందే. ఆయనకు కుమారుడు లోకేష్ తన వారసుడు కావాలని ఉంది. అయితే సీనియర్ ఎన్టీఆర్ కి గ్లామర్ ఉంటే చంద్రబాబుకు గ్రామర్ ఉంది మరి లోకేష్ కి ఈ రెండూ లేవు అన్నది క్యాడర్ మాట. అందుకే వారు గ్లామర్ ఉన్న నందమూరి మూడవ తరాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా బాబుని నెత్తిన మోసిన వారే లోకేష్ వద్దు అనేస్తున్నారు. వారిని కాదని బాబు ముందుకు వెళ్తే మాత్రం కష్టమే అన్న మాట ఉంది. చంద్రబాబుకు ఇది విషమ పరీక్షగానే చూడాలి. ఒక వైపు తన రక్తం. మరో వైపు పార్టీ. చంద్రబాబు రాజకీయ నాయకుండి నుంచి రాజకీయ కోవిదుడుగా మారేందుకు ఇదే సరైన అవకాశం. తనకు పార్టీ తప్ప మరేమీ అక్కరలేదని బాబు చెప్పదలచుకుంటే కచ్చితంగా ఎన్టీఆర్ ని టీడీపీలోకి ఆహ్వానిస్తారు. అలా పదికాలాలు పార్టీతో పాటు చంద్రబాబు పేరు కూడా మారుమోగుతుంది.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Tammulla Junior Japam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page