నిత్య సేవకులకు నీరాజనం అప్పన్న బోయిలకు నూతన వస్త్రాలు , నగదు    ఆలయంలో అందజేసిన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు

0 36

సింహాచలం  ముచ్చట్లు:

అప్పన్న దేవస్థానంలో బోయిల పాత్ర అత్యంత కీలకం ., సిరులొలికించే సింహాద్రినాధుడిని నిరంతరం తమ భుజస్కందాలపై మోసే అదృష్టం దక్కించుకున్న బోయిలు నిరంతర సేవకులే ,,. కొండ దిగువున పాత అడవివరం , విజినీగిరిపాలెంకు చెందిన 20 మంది బోయిలు నిరంతరం సింహాద్రినాధుడి సేవలో తరిస్తారు ., అయితే వీరు శాశ్వత ఉద్యోగులు కాదు , అలాగని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అంత కంటే కాదు . కాని ఆలయంలో విశేష ఉత్సవాలు జరిగినప్పుడు , కొండ దిగువుకు స్వామిని తీసుకువచ్చే సమయంలో వీరే కీలకం . మకరవేట ( గజేంద్రమోక్షం ) , తెప్పోత్సవం , జమ్మివేట , బొట్టినడిగే పున్నమితో పాటు అనేక సందర్భాల్లో స్వామిని , అమ్మవార్లను మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు వీరే తీసుకువస్తారు . ఇక గ్రామ తిరువీధిలోని వీరి సేవలు ప్రశంసనీయం . అయితే ఉత్సవాలను బట్టి మాత్రమే వీరు ఆలయ వర్గాలు పిలుపు మేరకు హాజరుకావడం జరుగుతుంది , స్వామి, అమ్మవార్ల సేవలో వీరి సేవలు అత్యంత ప్రశంసనీయం. ఈ నేపధ్యంలోనే వీరి సేవలను గుర్తించాలని భావించి తన వంతు గా  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టు ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు బుధవారం అప్పన్న ఆలయంలో వీరికి పంచ , కండువా , షర్టుతో కూడిన నూతన వస్త్రాలను , కొంత నగదును అందజేసి సత్కరించారు… ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అప్పన్న ఉత్సవాల్లో బోయిలు సేవలు అత్యంత ప్రశంసనీయమని ,. స్వామివారి సేవలో పాల్గొనడం వీరి అదృష్టమని అభివర్ణించారు . కేవలం వేతనం కోసం కాకుండా , స్వామి వారికి సేవలందించాలని భావించే వారు తరచూ హాజరుకావడం జరుగుతుందని ఇది అభినందనీయమన్నారు . సింహాచలం
గ్రామస్తుడుగా వారి సేవలు తాను గుర్తించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు..భవిష్యత్తులో వారికి దేవస్థానం తాత్కాలిక గుర్తింపు కార్డులు ఇచ్చి , సముచిత స్థానం కల్పించాలని ట్రస్టుబోర్డు సమావేశంలో కోరనున్నట్లు శ్రీనుబాబు చెప్పారు . అనంతరం సింహాద్రి నాధుడు నిత్య కళ్యాణం లో పాల్గొని స్వామి. అమ్మవార్ల ను సేవించి తరించారు…

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:New clothes and cash for Nirajanam Appanna Boyle for the daily servants
Gantla Srinubabu is the special invitee of the Appanna Board of Trustees presented at the temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page