నూతన సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే  శ్రీదేవమ్మ

0 21

పత్తికొండ ముచ్చట్లు:

పత్తికొండలో గెస్ట్ హౌస్ సమీపంలో గల 6వ గ్రామ వార్డు సచివాలయన్ని   పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రారంభించారు..  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సచివలయాల నిర్మాణాలు చాలా వేగవంతం గా నిర్మిచాలన్నారు. మిగతా గ్రామ వార్డు సచివాలయాలు మరింత వేగవంతంగా నిర్మించి ప్రతి ఒక్కరికి కుల,మత బేధాలు లేకుండా అన్ని సంక్షేమ సదుపాయాలు కల్పించి మన  జగనన్న కు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషయ్య , ఎంపిడిఓ పార్థసారథి, పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ ఈఓ కృష్ణకుమార్, పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వర్లు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపిక, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, ఉప్పర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప, మాజీ సర్పంచ్ సోమశేఖర్, ఎంపీటీసీ సభ్యులు గణపతి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీనివాస రెడ్డి, పల్లె ప్రతాప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు నారాయణ దాస్, షాదీఖానా కమిటీ చైర్మన్ హనీఫ్, కోటి, డాక్టర్ నీలకంఠ, నజీర్, ఇమ్రాన్, షరీఫ్ మరియు డాక్టర్ మురళీ మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పత్తికొండ మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రి నీ ఎమ్మెల్యే శ్రేదేవమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పటల్ ప్రాంగణంలో  స్కానింగ్ వైద్య నిమిత్తం వచ్చిన గర్భిణీల తో ఆమె మాట్లాడుతూ గర్భిణులు ఎప్పటికప్పుడు స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలని గర్భిణీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి ఇచ్చిన మందులు ప్రతి రోజు వాడుతూ వైద్య పరీక్షలు చేయించుకోవలన్నారు. వైద్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. డాక్టర్ కల్పన తో మాట్లాడుతూ పేషెంట్లకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఎక్కువ సేపు గర్భిణులను నిలబెట్టకుండా వీలైనంత తొందరగా స్కానింగ్ చేసి వారిని పంపించాలని తెలియజేశారు.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:MLA Sridevamma inaugurated the new secretariat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page