మున్సిపల్ పార్కు ను ప్రారంభించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి

0 18

ఆదోని ముచ్చట్లు:

పట్టణంలో మహావీర్ కాలనీ నందు  ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి బుధవారం మున్సిపల్ పార్కు ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత స్కీం కింద 52 లక్షల రూపాయలతో  కొత్త మున్సిపల్ ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ప్రజలందరూ పార్కును ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. గతంలో మేము మాట ఇచ్చిన ప్రకారం ఈ కాలనీలో పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ కాలనీలలో కూడా అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇంకా ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అది తక్షణం పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆదోనిలో బైపాస్ రోడ్డు మెడికల్ కాలేజ్ రోడ్లు ఎంకరేజ్మెంట్ రోడ్లు విస్తరణ ఇవన్నీ కూడా త్వరలో పనులు జరుగుతాయని సీఎం  అన్నారని ఎమ్మెల్యే చెపారు. ప్రస్తుతం అందరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జయ మనోజ్ రెడ్డి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా మున్సిపల్  చైర్మన్ శాంతమ్మ  సీఐ చంద్రశేఖర్ చంద్రకాంత్రెడ్డి  కౌన్సిలర్ సందీప్ రెడ్డి ఎస్సై రమేష్ లక్ష్మి కాంత్ రెడ్డిసన్నీ  మామత్తు స్వామి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:MLA Saiprasad Reddy inaugurated the Municipal Park

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page