రేష‌న్ కార్డుల జారీపై ఈ నెల 14న మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీ

0 20

హైద‌రాబాద్ ముచ్చట్లు:
అర్హులైన వారికి రేష‌న్ కార్డుల జారీపై ఈ నెల 14న మంత్రివ‌ర్గ ఉప‌సంఘం భేటీ కానుంది. రేష‌న్ డీల‌ర్ల స‌మ‌స్య‌లు, ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ ప‌టిష్టంపై చ‌ర్చించనున్నారు. విధివిధానాల ఖ‌రారుకు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఆధ్వ‌ర్యంలో స‌మావేశం జ‌ర‌గ‌నుంది.పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న‌ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా దాదాపు నాలుగున్నర లక్షలమందికి రేషన్‌ కార్డులు అందనున్నాయి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుల కోసం 4,46,168 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ 15 రోజుల్లోగా రేషన్‌ కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రివర్గం సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో నాలుగున్నర లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 87.43 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. వీటి వల్ల సుమారు 2.83 కోట్ల మంది లబ్ధిదారులకు ఆకలి తీరుతున్నది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:The Cabinet sub-committee met on the issue of ration cards on the 14th of this month

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page