రోగ నిర్దారణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

0 16

నల్గొండ    ముచ్చట్లు:
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగ నిర్దారణ పరీక్షల డయాగ్నోస్టిక్ హబ్ ను, ఆక్సీజన్ ప్లాంట్ ను  మంత్రి  జగదీష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే  భూపాల్ రెడ్డి, తెరాస  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తకెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ  నర్సిరెడ్డి,  జిల్లా కలెక్టర్ ప్రశాంత్  పాటిల్, మున్సిపల్ చైర్మన్  సైదిరెడ్డి, వైస్ ఛైర్మన్ అబ్బాగోని రమేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ జై సింగ్ రాథోడ్, డీసీహెచ్ఎస్ మాతృ నాయక్, ఐఎంయే జిల్లా అధ్యక్షుడు డా . పుల్లారావు, డీఎంహెచ్వో కొండల్ రావు, డయాగ్నోస్టిక్ సెంటర్ నోడల్ ఆఫీసర్ అరుంధతి, ఎంపీనీ Mpp కరీం పాషా, సుంకరీ మల్లేష్,,కటికం సత్తయ్య గౌడ్,  పున్న గణేష్,, జమాల్,,బకారం వెంకన్న,, పలువురు కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు. తరువాత మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిల రూపురేఖలను పూర్తిగా  మార్చారు  సీఎం కేసీఆర్. తల్లి బిడ్డల సంరక్షణకు ప్రభుత్వము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కోవిడ్ వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రిలు  ఎనలేని సేవలు చేస్తున్నాయి…. నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాయి. రోగ నిర్దారణ పరీక్షలు చేయడం కోసం    ప్రత్యేకంగా అధునాతన పరికరాలతో డయాగ్నోస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేసింది ప్రభుత్వమని అన్నారు. ఈ సెంటర్ లాల్లో క్యాన్సార్, రొమ్ము క్యాన్సార్, గుండె పరీక్షలు కూడా చేసేలా అధునాతన పరికరాలను అందుబాటులో కి తెచ్చాం. మెరుగైన వైద్య సేవలను అందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం    ప్రజలకు అందించేలా సబ్ కమిటీ అధ్యయనం చేస్తుంది.10 వెల కోట్లు వెచ్చించి అయిన   ప్రభుత్వ ఆసుపత్రిలను సర్వాంగ సుందరంగా  తీర్చి దిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ డయగ్నోస్టిక్ సెంటర్ లాల్లో సేవలకు ఆటంకం కాకుండా ప్రత్యేక  సిబ్బంది,, ని మెకానిక్ సిస్టంని ఏర్పాటు చేసాము ఐసీయూ  బెడ్స్ కలిగిన మొబైల్  వైద్యం అందించేందుకు బస్సులను కూడా అందుబాటులో తెచ్చామని మంత్రి అన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:Minister who inaugurated the diagnostic center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page