వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు వైద్య రంగం మరో అడుగు          రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0 9

ఖమ్మం  ముచ్చట్లు:
వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాల ఏర్పాటుతో వైద్య రంగం మరో ముందడుగు వేసిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని, శాంపిల్స్ తరలించే వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ..వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వ వైద్య రంగం మరో అడుగు ముందుకేసిందన్నారు.తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని, గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింప చేసిందన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసిందన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షలకోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరీక్ష యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికతతో, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో, ఖరీదైన యంత్రాలని వినియోగించనున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కేంద్రాల్లో డయాగ్నొస్టిక్ సెంటర్ లను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మేయర్ పునుకొల్లు నీరజ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్‌వో మాలతి, దవాఖాన సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:The medical sector is another step towards setting up diagnostic testing centers
Transport Minister Puwada Ajay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page