700 కోట్లతో హెచ్ఎండీఏ ప్రాజెక్టులు

0 18

రంగారెడ్డి     ముచ్చట్లు:
హెచ్‌ఎండీఏ రూ.700 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులకు మోక్షం కలిగిస్తూ హెచ్‌ఎండీఏ సొంత ఆదాయంతోనే ఆ పనులు చేపట్టింది. గత ఆరేళ్లుగా విశ్వనగరాభివృద్ధిలో హెచ్‌ఎండీఏ తనదైన మార్క్‌తో ముందుకెళుతోంది.    రూ.384 కోట్లతో బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులు కొనసాగుతుండగా… వందేళ్లు పూర్తి చేసుకుంటున్న గండిపేట చెరువును ఎకో టూరిజం స్పాట్‌గా మార్చేందుకు రూ.100 కోట్ల నిధులకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో ఆ అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో బాటాసింగారం, మంగల్‌పల్లిలో లాజిస్టిక్‌ హబ్‌ (వస్తు నిల్వకేంద్రాలు) పనులు పూరై్త అందుబాటులోకి వచ్చాయి. హరితహరంలో భాగంగా కోట్ల మొక్కలు సిద్ధం చేసి పచ్చదనం కోసం పాటుపడుతోంది. బాలానగర్‌ నర్సాపూర్‌ ఎక్స్‌ రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడానికి హెచ్‌ఎండీఏ రూ.384 కోట్లతో  బాలానగర్‌లోని శోభన థియేటర్‌ నుంచి ఐడీపీఎల్‌ వరకు 1.09 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు మొదలెట్టింది.శివారులో అనధికారిక లే అవుట్‌లకు క్రమబద్దీకరించుకునేందుకు ఇచ్చిన లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ద్వారా హెచ్‌ఎండీఏకు వచ్చిన రూ.1100 కోట్ల ఆదాయాన్ని ప్రజల మౌలిక వసతులకు ఖర్చుబెడుతున్నారు.  సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.10 కోట్లు, పటాన్‌చెరులో రూ.మూడు కోట్లతో రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల వసతుల పనులు పూర్తి చేశారు సంగారెడ్డి పట్టణంలో రూ.6.59 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు, డ్రై నేజీ ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు చేశారు.రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులోని ఇంజాపూర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి వై జంక్షన్‌ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.రెండు కోట్ల 95 లక్షలను మంజూరు చేసింది. రూ.ఐదు కోట్లతో పటాన్‌చెరులో ట్రక్కు పార్కింగ్‌ పనులు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది.  మేడ్చల్‌ జిల్లాగా ఏర్పడిన తర్వాతనే 11,750 కొత్త పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమల్లో రూ.15091.84 కోట్ల పెట్టుబడులను పారిశ్రామిక వేత్తలు పెట్టగా 2,29,673 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.  అలాగే మరో  783 భారీ, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు  ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

Tags:HMDA projects with Rs 700 crore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page