ఉచిత బియ్యంలో కంది పప్పు ఇవ్వరంట

0 28

-ముఖ్యమంత్రి ఆశయానికి   తూట్లు
-వ్యాన్ నందు కేవలం బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నారు

బేతంచెర్ల   ముచ్చట్లు:
ప్రభుత్వం కొత్తగా చౌక దుకాణాల స్థానంలో  ప్రజలకు మరింత దగ్గర గా సేవలందించాలన్న సంకల్పంతో   ఏర్పాటు చేసిన కొత్త ఆలోచనే ఈ బియ్యం ట్రక్కుల నిర్వహణ.అయితే బేతంచెర్ల పట్టణంలోని సంజీవ నగర్ లో ఉన్న చౌక దుకాణం 7 వ నంబర్ లో కేవలం బియ్యం మాత్రమే అందించి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. ప్రభుత్వం బియ్యం, కంది పప్పు, చక్కెర ను ఇవ్వాలని తెలిపినా బియ్యం మాత్రమే పంపిణీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం అందించే కంది పప్పు పుచ్చి పోయాయని అందుకే మేము ఇవ్వడం లేదని మేకపోతు గాంభీర్యాన్ని  ప్రదర్శించడం అతిశయోక్తి.అయితే మండలలో మరికొన్ని బియ్యం ట్రక్కు,చౌక దుకాణాల నిర్వాహకులు సైతం ఇదే పంథాను ప్రదర్శిస్తున్నారని వినికిడి.ప్రభుత్వం సంకల్పానికి తూట్లు పోడిచే ఇలాంటి చౌక దుకాణాలపై మండల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Give lentils in free rice

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page