కంచుకోటకు బీటలు

0 37

ఏలూరు   ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావించక ఇక్కడ ఒక్కసారే ఓటమి పాలైంది. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే టీడీపీ కేవలం 2004 ఎన్నికల్లోనే ఓడిపోయింది. మిగిలిన 8 సార్లు ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండానే ఎగిరింది. రాష్ట్రంలో జగన్ గాలి బలంగా ఉన్నా సరే 2019 ఎన్నికల్లో ఉండిలో మాత్రం టీడీపీ గెలిచింది. దీనిని బ‌ట్టే ఉండి టీడీపీ ఎంత కంచుకోటో తెలుస్తోంది. వైఎస్ ప్రభంజనం అయినా.. జ‌గ‌న్ సునామీ అయినా ఉండిలో సైకిల్ స‌త్తా చెక్కు చెద‌ర్లేదు. ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ తర‌పున మంతెన రామరాజు  విజయం సాధించారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాంబాబు, కాస్త సైలెంట్‌గానే పనిచేసుకుంటూ వెళుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు.అదే సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ, అధికార వైసీపీపై దూకుడుగా వెళ్ళడం లేదు. ఇటు టీడీపీలో ఉంటూనే, అటు వైసీపీతో కూడా మంచిగానే ఉంటున్నారు. ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేయడం లేదు. నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి జిల్లాలోని వైసీపీ నేతలతో సఖ్యతతోనే ఉంటున్నారన్న ప్రచారం స్థానికంగా టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తామ‌ని టీడీపీ ఆఫ‌ర్ చేయ‌డంతో ఆర్థికంగా భారీ రిస్క్ చేసే రాంబాబు గెలిచారు. అయితే ఇప్పుడు ప్రభుత్వంతో సై అనేలా వ్యవ‌హ‌రిస్తే ఆయ‌న వ్యాపారాల‌కు కూడా పెద్ద రిస్కే అన్న నిర్ణయానికి ఆయ‌నే వ‌చ్చేశార‌ట‌.జిల్లాలో త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన మంత్రి రంగ‌రాజుతో లోపాయికారిగా స‌ఖ్యత‌తో ఉంటున్నట్టు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.

అయితే ఇలా కర్ర విరగకూడదు…పాము చావు కూడదు అన్న చందంగా నడుస్తున్న రాంబాబుకు నెక్స్ట్ ఎన్నికల్లో ఉండి సీటు దక్కుతుందా లేదా అనేది కాస్త డౌట్‌గానే ఉంది. ఎందుకంటే 2009, 2014 ఎన్నికల్లో ఉండి నుంచి వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ) టీడీపీ తరుపున గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల్లో భాగంగా చంద్రబాబు, శివని నరసాపురం ఎంపీగా బరిలో దించారు. ఇక శివకు సోదరుడు వరుసయ్యే రాంబాబుని ఉండిలో నిలబెట్టారు.ఇక జగన్ వేవ్‌లో శివ ఓటమి పాలయ్యారు. ఈయనపై రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి శివ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. సొంత వ్యాపారాలు ఉండటంతో సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో శివ మళ్ళీ ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాన‌ని చెప్పేశార‌ని తెలుస్తోంది. శివకు మళ్ళీ నరసాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదన్నది క్లారిటీ వచ్చేసింది. శివ వస్తే రాంబాబు సైడ్ అవ్వాల్సిందే. మరి చంద్రబాబు ఆ ఇద్దరి నేతలకు ఎలా న్యాయం చేస్తారో చూడాలి. ఏదేమైనా ఉండి టీడీపీలో ఈ ఇద్దరు నేత‌ల రాజ‌కీయం కొత్తగా మారేలా క‌నిపిస్తోంది.

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Cracks in Kanchukota

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page