కరోనాతో పెరిగిన బాల కార్మికులు

0 22

జెనీవా ముచ్చట్లు:

 

బాల కార్మికుల సంఖ్య మ‌ళ్లీ పెరిగింది. రెండు దేశాబ్ధాల త‌ర్వాత ఆ సంఖ్య పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి. క‌రోనా వైర‌స్ సంక్షోభం వ‌ల్ల ల‌క్ష‌ల సంఖ్య‌లో యువ‌కులు కూడా ఇదే త‌ర‌హా భ‌విత‌వ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఐక్యరాజ్య‌స‌మితి పేర్కొన్న‌ది. అంత‌ర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ)తో పాటు యూఎన్‌కు చెందిన యునిసెఫ్ ఈ రిపోర్ట్‌ను సంయుక్తంగా త‌యారు చేశాయి. 2020 నాటికి బాల‌కార్మికులు 16 కోట్లు ఉంద‌ని, గ‌త నాలుగేళ్ల‌లో 84 ల‌క్ష‌ల మంది బాల కార్మికులు పెరిగిన‌ట్లు ఆ నివేదిక చెప్పింది. క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన త‌ర్వాత ప‌ది మందిలో ఒక చిన్నారి బాల కార్మికుడిగా మారిన‌ట్లు రిపోర్ట్‌లో వెల్ల‌డించారు. ఆఫ్రికాలో ఇది మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది. రానున్న రెండేళ్ల‌లో మ‌రో 5 కోట్ల మంది పిల్ల‌లు బాల కార్మికులిగా మారే ప్ర‌మాదం ఉంద‌ని యూఎన్ హెచ్చరించింది. బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డంలో విఫ‌లం అవుతున్న‌ట్లు యునిసెఫ్ చీప్ హెన్రిటా ఫోరే తెలిపారు. కోవిడ్ వ‌ల్ల ప‌రిస్థితి మ‌రింత అధ్వాన్నంగా మారుతున్న‌ట్లు ఆమె చెప్పారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Child labor raised with Corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page