కరోనా రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

0 36

తిరుపతి ముచ్చట్లు :

 

మానవ సేవ మాధవ సేవగా భావించే బ్రహ్మర్షి ఆశ్రమం కరోనా పేషంట్లకు ఉపయుక్తమైన హోమ్ ఐసులేషన్ కిట్లు వితరణగా అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేతుల మీదుగా వితరణ హోమ్ ఐసులేషన్ కిట్లను శ్రీ పద్మావతీ నిలయం వేదికగా కరోనా పేషంట్ల కు అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతీ నిలయం కోవిడ్ కేర్ సెంటర్ లో కరోనా పేషెంట్లకు అవసరమైన ఆహార తయారీకి సంబంధించి వంట గదిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వంటకాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఆహార నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి మీడియా తో మాట్లాడుతూ  కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో మన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ముఖాన్ని పదే పదే చేతులతో తాకకూడదని, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తగిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు.

 

 

 

- Advertisement -

విటమిన్లు, పోషక విలువలు ఎక్కువగా లభించే కూరగాయాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు.
గుడ్డు తింటే శారీరకంగా బలం చేకూరి రోగ నిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారని వివరించారు. అలాగే కరోనా వచ్చిన పేషెంట్లకు నియోజకవర్గ పరిధిలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ల లో నాణ్యమైన ఆహారం  అందిస్తున్నట్లు వెల్లడించారు.  రామచంద్రపురం సమీపంలోని శ్రీ సిద్దేశ్వర తీర్థ్, బ్రహ్మర్షి ఆశ్రమం తరపున దాదాపు ఐదు వందల మంది కరోనా పేషెంట్లకు హోమ్ ఐసులేషన్ కిట్లు అందించారు. ఇందులో విటమిన్ సి, జిన్ కోవిట్, పారాసిట్ మాల్, అజిత్రో మైసిన్, సిట్రజిన్, విటమిన్ – డి తో పాటు సానిటైజర్, మాస్క్ ను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతీ నిలయం నోడల్ అధికారిని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Ms. Chevireddy consulting corona patients

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page