కేంద్రం మద్దతు ధరపై రైతుల అసంతృప్తి

0 6

కోరుట్ల ముచ్చట్లు:

 

కేంద్రం మద్దతు ధరపై రైతులు అసంతృప్తి ఉన్నారని మాజీ సింగిల్ విండో చెర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెట్ పెల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలకు మద్దతు ధర పెంపు పై ప్రకటన చేశారని, వరి కి 72 రూపాయలు మొక్కజొన్నకు 20 రూపాయలు ఇవ్వడం జరిగిందని దాని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. డీజిల్ ధర 70 రూపాయలు ఉన్నపుడు ఒక ట్రాక్టర్ గంటకు ఒక ఎకరానికి 800 వందలు తీసుకున్నారని, ఇప్పుడు డీజిల్  ధర పెరగడం వల్ల గంటకు ఎకరానికి 1,100 రూపాయలు అవుతుందని అన్నారు. కూలీలు దొరకడం లేదని, లక్ డౌన్ వల్ల చాలా  ఇబ్బంది అవుతుందని, ఏ పని చేయాలన్న ఎటు చూసినా ఖర్చులు 30 శాతం పెరిగాయని  మద్దతు ధర 30 శాతం పెరగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కి క్విటాలుకు 2,500 మద్దతు ధర ఉండాలని సిపారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం దానిని 1,250 కి చూపించి 50 శాతం పెంచి 1,880 కు పెంచడం చాలా దారుణం అన్నారు. మొక్క జొన్నకు కూడా 2,500 ఉండాలని కానీ 20 పెంపకం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మద్దతు ధరలు పెంచాలన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి అన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Farmers dissatisfied with center support price

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page