కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాలి-సిఐటియు నిరసన

0 6

పెద్దపల్లి ముచ్చట్లు :

 

పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డ్స్ తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.   ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు, రైతులకు, ప్రజలకు నష్టం చేసే అనేక చర్యలను చేపట్టిందని, వీటిని మార్చుకుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.    కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని,  2020 విద్యుత్ చట్టం రద్దు చేయాలని, ఫ్రంట్లైన్ వర్కర్గా పని చేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఇతర కేటగిరీల కార్మికులను 50 లక్షల ఇన్సూరెన్సు అమలుచేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని, అందరికీ ఉచితంగా టీకాలు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని, రాబోయే కరోనా మూడవ ప్రమాదాన్ని ఎదుర్కోడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకుని దానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

 

 

 

- Advertisement -

అదేవిధంగా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టే, మోటార్ వెహికల్ యాక్ట్ 2020 ఉపసంహరించుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖలో, మున్సిపల్ గ్రామపంచాయతీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.   ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను మానుకొని భారత దేశ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను, సమస్యలను అధిగమించడానికి కావలసిన చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు.   ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి, జ్యోతి ఎస్ వెంకట స్వామి, ఏం, కొమురయ్య, పూసల రమేష్, మామిడిపల్లి రాజేశం, రాజేందర్, రమణయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణని కలిసి మెమోరాండం ఇచ్చారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Central government should change anti-democratic policies of labor-CITU protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page