కొవిడ్ వ్యాక్సిన్ ధరలే ఎక్కువ

0 25

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఇండియాలో ప్ర‌స్తుతం అత్య‌ధిక ధ‌ర ఉన్న వ్యాక్సిన్ కొవాగ్జినే. హైద‌రాబాద్‌కు చెందిన భారత్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ధ‌ర కొవిషీల్డ్ (రూ.780) కంటే దాదాపు రెట్టింపు ఉంది. నిజానికి ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకున్న స్పుత్నిక్ వి (రూ.1145) కంటే కూడా కొవాగ్జిన్ ధ‌ర ఎక్కువ‌. జీఎస్టీ, రూ.150 స‌ర్వీస్ ఛార్జీ క‌లుపుకొని ప్రైవేట్‌లో కొవాగ్జిన్‌కు రూ.1410 ధ‌ర నిర్ణ‌యించారు. గ‌తేడాది తమ వ్యాక్సిన్ గురించి చెబుతూ.. నీళ్ల బాటిల్ ధ‌ర‌లో ఐదో వంతు ఉంటుంద‌ని చెప్పిన ఆ సంస్థ చైర్మ‌న్ కృష్ణా ఎల్లా.. ఇప్పుడు ఇంత ధ‌ర ఎలా పెట్టార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అయితే దీనికి నిపుణులు స‌మాధాన‌మిస్తున్నారు.సెంట‌ర్ ఫ‌ర్ సెల్యుల‌ర్ అండ్ మాలెక్యులార్ బ‌యోల‌జీ (సీసీఎంబీ) అడ్వైజ‌ర్ రాకేశ్ మిశ్రా మాటల్లో చెప్పాలంటే కొవిషీల్డ్‌, స్పుత్నిక్ వ్యాక్సిన్ల కోసం వాడుతున్న టెక్నాల‌జీ కంటే కొవాగ్జిన్ టెక్నాల‌జీ పూర్తిగా భిన్న‌మైన‌ది. కొవాగ్జిన్ త‌యారీ కోసం క్రియార‌హితం చేసిన వైర‌స్‌నే వాడుతున్నారు. దీనికోసం ఖరీదైన సీరంను విదేశాల నుంచి కొన్ని వంద‌ల లీట‌ర్లు దిగుమ‌తి చేసుకోవాలి. బీఎస్ఎల్ ల్యాబ్‌ల‌లో ఈ సీరంలో వైర‌స్‌ను వృద్ధి చేసి త‌ర్వాత క్రియా ర‌హితం చేస్తారు అని రాకేశ్ మిశ్రా చెప్పారు.

 

 

 

- Advertisement -

సాంకేతికంగా చూస్తే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు చేయ‌డం సులువు. ఖ‌ర్చు కూడా త‌క్కువ అని ఆయ‌న తెలిపారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు నేరుగా వైర‌స్‌ను ఉప‌యోగించ‌వు. ఇవి శ‌రీరంలోని క‌ణాల‌కు హాని లేని రీతిలో కొవిడ్ వైరస్‌పై ఉండే స్పైక్ ప్రొటీన్‌ను త‌యారు చేసేలా ప్రేరేపిస్తాయి. త‌ద్వారా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఉత్తేజిత‌మ‌వుతుంది. అదే వైర‌స్‌ను క్రియా ర‌హితం చేసి వ్యాక్సిన్‌ను త‌యారు చేసే కొవాగ్జిన్ టెక్నాల‌జీ సుదీర్ఘ‌మైన‌ది. అందుకే ఇది ఏ వేరియంట్‌నైనా ఎదుర్కొంటుంది అని రాకేశ్ మిశ్రా తెలిపారు.నిజానికి ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సిన్ల ధ‌ర కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కొవిడ్ వ్యాక్సిన్ల‌కు వ‌సూలు చేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు పెంటావ‌లెంట్ వ్యాక్సిన్‌నే తీసుకుంటే ఇది డోసు కేవ‌లం రూ.17.37 మాత్ర‌మే. ఇదే సీరం, బ‌యోలాజిక్ ఈ సంస్థ‌లు దీనిని త‌యారు చేస్తున్నాయి. ఇక మీజిల్స్ కోసం సీరం.. యూనిసెఫ్‌కు స‌ర‌ఫ‌రా చేసే వ్యాక్సిన్ ధ‌ర రూ.30 మాత్ర‌మే. కొవాగ్జిన్‌లాంటి టెక్నాల‌జీనే ఉప‌యోగించే రేబిస్ వ్యాక్సిన్ ధ‌ర రూ.200. ఆ లెక్క‌న చూసుకుంటే కొవిడ్ వ్యాక్సిన్ల ధ‌ర చాలా చాలా ఎక్కువ‌. పారిశ్రామిక వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. కొవిడ్ వ్యాక్సిన్ల త‌యారీకి అయిన ఖ‌ర్చు కంటే మూడింత‌ల ధ‌ర నిర్ణ‌యించాయి అన్ని సంస్థలు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Kovid vaccine prices are high

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page