కౌలు రైతులు కౌలు కార్డు దరఖాస్తు చేసుకోండి-మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్

0 47

బేతంచెర్ల ముచ్చట్లు:

 

అర్హులైన  కౌలు రైతులు కౌలు  కార్డు కు దరఖాస్తు చేసుకోవాలని బేతంచర్ల మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. గురువారం నాడు కొత్తపల్లి  గ్రామంలో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కౌలు చేసే ప్రతి రైతు ఈ కౌలు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ కౌలు కార్డు 11 నెలల వరకు ఉపయోగపడుతుందని తర్వాత మళ్లీ వీటిని రెన్యూవల్ చేసుకోవచ్చని ఆయన అన్నారు.  కౌలు కార్డు ద్వారా బ్యాంకు లో లోన్ తీసుకోవచ్చని,  పండించిన పంటకు మద్దతు ధర అమ్ముకోవచ్చని, పంట నష్టపోయిన అప్పుడు పంట నష్టపరిహారాన్ని పొందవచ్చని,  రైతు భరోసా పథకం కింద 7500 రూపాయలు పొందవచ్చని, పంట బీమా ను పొందవచ్చని ఇలాంటి ఉపయోగాలు కౌలు రైతులకు ఉన్నాయని దీని ద్వారా హక్కుదారు రైతుకు ఎటువంటి నష్టం కలగదు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.  ఈ కార్యక్రమంలో కొత్తపల్లె విఆర్వో రఫీ, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రఖ్యాతి,  పి. ఎస్ నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Lease Farmers Apply for Lease Card-Zonal Agriculture Officer Kiran Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page