గనులపై సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

0 40

పెద్దపల్లి  ముచ్చట్లు:
బిజెపి మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1బ్రాంచి కమిటీ, పిట్ కమిటీల ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అర్జి1 కార్యదర్శి మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే నిరసన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులు వైరస్ కు భయపడుతూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ప్రభుత్వ రంగ సంస్థలే ముందుండి ఎదుర్కొంటున్నాయని, కార్మికులకు, కర్షకులకు, పేద ప్రజలకు, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రజలను నిలువు దోపిడి చేస్తున్న పరిస్థితి ఉందని, ఇలాంటి తరుణంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, కార్పొరేట్ హాస్పిటల్స్ ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోకుండా, ప్రజలందరికీ టీకాలు అందించకుండా, నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గు పరిశ్రమను, సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, ఇప్పటికే 44 కార్మిక చట్టాలను 4 కోడ్స్ గా మార్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని, పెట్టు బడిదారులకు ఊడిగం చేస్తూ, బిజెపి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఆరోపించారు. బొగ్గుగని కార్మికులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలని, కార్మికులందరికీ కరోనా టీకాలు ఉచితంగా అందించాలని, కరోనా నివారణ చర్యలు విస్తృతంగా చేపట్టాలని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యమాలు చేస్తారని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం గని అధికారుల ద్వారా ప్రధానమంత్రికి వినతి పత్రం పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేదరి సారయ్య, ఆరేపల్లి రాజమౌళి, జే.గజెందర్, అన్నం శ్రీనివాస్, బుగ్గారం శ్రీనివాసరావు, నంది నారాయణ, బూరుగుల రాములు, బి రవి, బొద్దుల ఓదెలు, పొనగంటి రవి, కార్మికులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:CITU-led protest over mines

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page