“గ్రోస్ మేట్” ఆప్ ను ప్రారంభించిన రామగుండం సీపీ

0 31

పెద్దపల్లి ముచ్చట్లు:
గతంలో లక్షెట్టిపేట్ పోలీస్ శాఖ, రవీంద్రభారతి స్కూల్ పూర్వ విద్యార్థుల సహకారంతో పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ లాక్ డౌన్ కారణంగా వారు ఈ శిక్షణ తరగతులకు హాజరు కాలేకపోతున్నందున, నిరుద్యోగులు కొరకు ఈ సమయంలో ఏదైనా చేస్తే బాగుండు అని ఆలోచనతో వాట్సాప్ లో స్టడీ మెటీరియల్ అందజేస్తున్నారు. కానీ విద్యార్థులకు వచ్చే డౌట్స్ తీర్చలేక కొంత అసౌకర్యం కలిగింది. ఈ అసౌకర్యాన్ని గ్రోస్ మేట్ ఆప్ ద్వారా అధిగమించవచ్చునని ఆలోచన చేసి లక్షెట్టిపేట్ చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందుల తిరుపతి గ్రోస్ మెట్ యాప్ ద్వారా వారికీ ఆన్లైన్ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ యాప్ ను గురువారం రామగుండం కమిషనర్ సత్యనారాయణ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇది నిరుద్యోగ యువతీ, యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారు ఇంటి నుండే క్లాస్ లు వినవచ్చని, అంతే కాకుండా డౌట్స్ ఉంటే కూడా నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. దీనిని అందరూ వినియోగించుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నదని, ఈ ఆప్ ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగ యువత కోసం ఈ ఆప్ ను ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు కందుల తిరుపతి అభినందించారు. గతంలో కూడా వీరు పోలీసు మీకోసం, జన మైత్రి పోలీసులు ఆధ్వర్యంలో నిరుద్యోగ  యువతీ, యువకులకు పోటీ పరీక్షల శిక్షణ ఇచ్చారని, ఆయన చేసిన సేవలకు సీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి సీనియర్ జర్నలిస్టు నేల్కీ జగన్ వర్మ, మెడికో శ్రీధన్ వర్మ పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Ramagundam CP launches “Gross Mate” app

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page