జనుము, జీలుగు విత్తనాల కొరత లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ కు  పట్టభద్రుల ఎమ్మెల్సీ లేఖ

0 3

జగిత్యాల    ముచ్చట్లు:

వ్యవసాయ రంగాన సాగుభూమి, సేంద్రీయంగా బలిపేతానికి కావల్సిన పచ్చిరొట్టె విత్తనాలైన జనుము, జీలుగు విత్తనాలను రైతాంగానికి అందుబాటులో ఉంచి ,కొరత లేకుండా చూడాలని   కోరుతూ గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి కు లేఖ వ్రాశారు.వ్యవసాయ రంగాన రైతాంగాన్ని ప్రోత్సహించే నిమిత్తం వితనాలన్ని రాయితీ పై కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట కాలానికి కేవలం పచ్చరొట్టె విత్తనాలైన జనుము, జీలుగు మినహా, మిగతావితనాలన్నింటిపై  ప్రభుత్వం రాయితీ తొలగించటంతో, రైతాంగం ఓపెన్ మార్కెట్ లో విత్తన ధరలపై ప్రభుత్వ పరంగా ఏ విధమైన అదుపు లేకపోవుటతో, ఒక వైపు అధిక ధరలతో ఇంకొక వైపు కల్తీ విత్తనాల బెడదతో, తీవ్ర ఆందోళనకు గురిఆవుతున్న పరిస్థితులకు తోడు ప్రస్తుతం రాయితీ పై కల్పించే పచ్చిరొట్టె జనుము, జీలుగు విత్తనాలు కూడా అటు వ్యవసాయ శాఖలో కానీ పిఏసిసిఎస్ లలో కానీ లేక ఆగ్రోస్ సంస్థలలో అందుబాటులో లేకపోవటం రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లప్తత మరియు నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చునని ఆన్నారు. కావున మృగషీర కార్తీ ప్రవేశంతో వర్షాలు ఆరంభం కావటంతో సాగుభూమి సేంద్రీయంగా బలోపేతానికి కావాల్సిన పచ్చి రొట్టె విత్తనాలైన జనుము, జీలుగు కొరత లేకుండా తక్షణమే అందుబాటులో తెచ్చే విదంగాచర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ కు వ్రాసిన లేఖలో ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page