జూన్ 16 నుంచి కొత్త అకడమిక్ ఇయర్

0 18

హైదరాబాద్ ముచ్చట్లు:

కరోనా మహమ్మారి రెండో విడత విరుచుకుపడడంతో మళ్లీ మూత పడిన తెలంగాణలోని విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పై తరగతులకు చెందిన విద్యా సంస్థలను పున:ప్రారంభించేందుకు కాస్త ముందుగానే ప్రయత్నాుల మొదలయ్యాయి. ఈ నెల 16 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న వేళ 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకోనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గుముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జులై నెలాఖరు వరకు కరోనా రెండో విడత తగ్గు ముఖం పడుతుందని.. స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖికపరమైన ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు, ప్రస్తుతం కరోనా కేసులతో ఇంటర్ వరకూ అన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయగా.. తాజాగా రెండో సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:New Academic Year from June 16th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page