నూతన కలెక్టరేట్ సమీకృత భవనాల సముదాయం ఆద్యంతం ఆహ్లాదం పంచేలా ముస్తాబు

0 13

కామారెడ్డి   ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ సమీకృత భవనాల సముదాయం ఆద్యంతం ఆహ్లాదం పంచేలా ముస్తాబైంది. భవనం చుట్టూ రహదారులు, గార్డెనింగ్, భవనం నమూనా చూపరులను కట్టిపడేస్తుంది. కలెక్టరేట్ భవనం ఇలా కూడా ఉంటుందా అని ప్రజలు ముక్కున వేలేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక రాత్రి అయితే దీపాల కాంతులతో భవనం దగదగ మెరిసిపోతుంది. కార్యాలయంలో అధికారుల ఛాంబర్ లు, సమావేశపు గదులు, మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్, ప్రజలు వేచి ఉండడానికి విశాలమైన వెయిటింగ్ హాల్, అందమైన కలెక్టర్ చాంబర్ ఇలా ఎన్నో ప్రత్యేక గదులు, అందమైన రూపురేఖలతో భవనం తయారయింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సమీకృత భవనం సిద్ధమైంది. మరి ఆ ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:New Collectorate Integrated Building Complex
Mustabu to spread the joy throughout

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page