పుంగనూరులో పారిశుద్ధ్య కార్మికులకు సేవలందించడం అదృష్టం -చైర్మన్‌ అలీమ్‌బాషా

0 97

పుంగనూరు ముచ్చట్లు:

 

ఆహర్నిశలు ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి, సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికులకు సేవ చేయడం ఎంతో అదృష్టమని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. గురువారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన సయ్యద్‌సుహేల్‌ అనే యువకుడు మున్సిపల్‌ కార్మికులకు సుమారు లక్షరూపాయలు విలువ చేసే ఆక్సిజన్‌ రెగ్యులేటర్లు, ధర్మామీటర్లు, శానిటైజర్లు , వాటర్‌ ఎవాపరేటర్లు విరాళంగా ఇచ్చారు. వీటిని కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ కార్మికులు కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్నారని, కార్మికులను, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి అపాయము కలగకుండ జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత పట్టణ ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ గంగిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ నటరాజ, మైనార్టీనాయకులు ఇనాయతుల్లా షరీఫ్‌, వైఎస్‌ఆర్‌సిపి ఎస్సీ సెల్‌ కార్యదర్శి బాలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Good luck serving the sanitation workers in Punganur – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page