పేదల సొంతింటి కల సాకారం చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది!

0 20

-రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
– కడప నగరపాలక పరిధిలోని నానాపల్లె లేఅవుట్ లో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ

కడప ముచ్చట్లు:

- Advertisement -

సంక్షేమ పాలనలో రాష్ట్ర దేశానికి ఆదర్శంగా ఉందని.. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “పేదలందరికీ ఇళ్లు” దేశ చరిత్రలోనే మహత్తరమైన ఘట్టం అని.. రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు.”నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు” పథకంలో  భాగంగా.. గురువారం నగర పరిధిలోని నానాపల్లిలోని 111 ఎకరాల్లో 4700 ప్లాట్లతో ఏర్పాటు చేసిన “వైఎస్ఆర్ జగనన్న కాలనీ” లే అవుట్ లో గృహనిర్మాణ పనులను.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా భూమి పూజ చేసి ప్రారంభించారు.అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ… ఈ రోజు పేద ప్రజలందరికీ పండుగ రోజు.  సొంతింటి కల సాకారం కానున్న శుభదినం అన్నారు. భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 31 లక్షల మంది పేదప్రజల సొంతింటి కల సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రపంచానికే ఆదర్శనీయం అన్నారు. వచ్చే మూడేళ్ళలో… పేదలందరికీ సొంత ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం పట్ల ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని.. పేదలకు నివాస స్థలాల పట్టాలుగా పంపిణీ చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం మనకు ఆ దేవుడు అందించిన గొప్ప వరం అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో.. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిరంతర ప్రక్రియగా  కొనసాగించడం జరుగుతోందన్నారు.

 

 

 

 

కడప నగరానికి అతి సమీపంలోని నానాపల్లి లేఔట్ లోని జగనన్న హౌసింగ్ కాలనీలో నగరంలోని 10 డివిజన్లకు చెందిన 4700 మంది కోసం 111 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి  ఇప్పటికే లబ్ధిదారులకు ఇంటిపట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. “జగనన్న కాలనీ” లే అవుట్ పరిసరాలు ఎంతో విలువైనవని, ప్రభుత్వం మంజూరు చేసిన ఈ జగనన్న కాలనీలు ఊర్లుగా, ప్రత్యేక మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకుంటాయన్నారు. అంతే కాకుండా చుట్టూ ఆరోగ్యకరమైన,  ఆహ్లాదకరమైన, అతి సుందరమైన పర్యాటక శోభను కూడా తలపిస్తుందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని గుర్తుచేశారు.ఇప్పటికీ కూడా ఇంటి స్థలాలు, ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే, వారి అర్హతలు పరిశీలించి 90 రోజుల్లోనే ఇంటిపట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇల్లు నిర్మాణ ప్రారంభ దశలోనే… జగనన్న కాలనీలలో నాలుగు ప్రధాన మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీటి వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.

 

 

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న “పేదలందరికీ ఇళ్లు” పథకం నిర్వహణ కోసం.. ఒక్కో జిల్లాకు ప్రత్యేక జాయింట్ కలెక్టర్ గా ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగిందంటే.. ముఖ్యమంత్రికి పేద ప్రజల పట్ల ప్రేమ, అభిమానం, అంతకుమించి బాధ్యత  సుస్పష్టం అవుతోందన్నారు. మహిళల పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కూడా కట్టించే బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో గృహానిర్మాణశాఖ ఎస్ఈ, వారి సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, నగర పరిధిలోని 10 డివిజన్లకు చెందిన ల్ కార్పొరేటర్లు, వైసీపీ ఇంఛార్జిలు, స్థానిక నాయకులు, మైనారిటీ నాయకులు, లబ్ధిదారులు
తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The credit for making the dream of the poor come true belongs to the state government!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page