పైడిమర్రికి నివాళులు

0 19

హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  ప్రతిజ్ఞ రూపకర్త, తెలంగాణ ముద్దుబిడ్డ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి ని పురస్కరించుకుని   హైదరాబాద్ లోని తన నివాసంలో వారి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…నల్గొండ జిల్లా అన్నపర్తి కి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు  భారతదేశం నా మాతృభూమి .., భారతీయులందరు నా సహోదరులు అనే ప్రతిజ్ఞ ను విద్యార్థి దశ నుండే దేశభక్తి అలవర్చుకోవాటానికి పాఠశాలల్లో జాతీయ గీతం , జాతీయ గేయం అనంతరం  ఈ ప్రతిజ్ఞ ద్వారా జాతీయ సమైక్యత ను చాటేలా రచించిన గొప్ప కవిగా మంత్రి అభివర్ణించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు తెలంగాణ కు చెందిన మహనీయులు, కవులను, సాహితీవేత్తలను, కళాకారుల ను, చరిత్రకారులను, సామాజిక వేత్తలను గౌరవించి , వారి జయంతి, వర్ధంతి లను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా పైడిమర్రి వెంకటసుబ్బరావు గారు రచించిన ప్రతిజ్ఞ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ని పెంపొందింపజేసి జాతీయ సమైక్యత ను, సమగ్రతను కాపాడి దేశ వారసత్వ సంపద ను కాపాడుకోని, ప్రతి ఒక్కరినీ  గౌరవించి, సహోదరులుగా మెలగాలని బోధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో   కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Tributes to Piedmont

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page