ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే కారణం-మమతతో రాకేశ్ తికాయత్

0 18

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

దేశంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని రైతు ఉద్యమ నేతరాకేశ్ తికాయత్ గురువారం వ్యాఖ్యానించారు. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన మర్నాడే తికాయత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోల్‌కతాలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ సీఎంను కోల్‌కతాలో బుధవారం కలిశానని, దేశంలో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉందని ఆమె చెప్పారని వ్యాఖ్యానించారు. ‘‘మేము (రైతులు) వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నాం.. అదే ప్రతిపక్షాల బలంగా ఉంటే తమకు ఆ అవసరం లేదు.. విపక్షాలు బలంగా ఉండాలి’’ అని మమతా చెప్పినట్టు పేర్కొన్నారు.మమతా బెనర్జీని కలవడానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా? అనే ప్రశ్నకు తికాయత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘నేను ముఖ్యమంత్రిని కలిశాను.. ఓ పార్టీ అధినేతను కాదు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోడానికి నేనేమైనా అఫ్గనిస్థాన్ అధ్యక్షుడ్ని కలిశానా? ముఖ్యమంత్రిని కలవడానికి వీసా అవసరమా?’’ ప్రశ్నించారు.‘‘కేంద్ర విధానాలపై మేము అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నాం.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం.. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి.. వారిని కూడా మేం కలుస్తాం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కూడా కలిశాం’’ అని అన్నారు. రైతు సంఘాల సమాఖ్య నేత రాకేశ్ తికాయత్‌తో సమావేశంలో మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయాలని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు‘‘పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.. ఔషధాలపై జీఎస్టీని తొలగించాలి.. గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై మాట్లాడటం లేదు…

 

 

 

 

- Advertisement -

మూడు కొత్త వ్యవసాయ చట్టాలను డిమాండ్ చేస్తున్నాం’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తమకు మమతా బెనర్జీ మద్దతు తెలిపినందుకు తికాయత్ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, మిగతా రాష్ట్రాలకు బెంగాల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత ఆరు నెలలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. గతేడాది నవంబరు 26న మొదలైన ఈ ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల తమకు మేలు జరగదని, కార్పొరేట సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చేవిగా ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The reason is that the Opposition is not strong – Rakesh Tikait with Mamata

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page